నా కోరిక ఇదే.. ప‌్ర‌ధాని మోడీ ఎమోష‌న‌ల్ ట్వీట్‌

-

తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రజలంద‌రికీ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ధన్యవాదాలు తెలిపారు. కరోనా మహమ్మారికి దూరంగా ఉండేందుకు ప్ర‌తీ ఒక్క‌రు మాస్క్‌లు ధరించాల‌ని, భౌతిక దూరం పాటించాలని కోరారు. చాలా మంది తనకు పుట్టిన రోజు ఎలాంటి కానుక కావాలని అడిగారంటూ ప్ర‌ధాని మోడీ గురువారం అర్ధరాత్రి ట్వీట్‌ చేశారు. *చాలామంది నా పుట్టిన రోజున నేను ఏమి కోరుకుంటాను అడిగారు. ఇప్పుడు నేను కోరుకునేది ఒక్క‌టే.. ప్ర‌తీ ఒక్క‌రు మాస్క్‌లు సరిగ్గా ధరించండి.. సామాజిక దూరాన్ని అనుసరించండి. గుర్తు పెట్టుకోండి. దో గ‌జ్‌కీ దూరీ.. రద్దీ ప్రదేశాలకూ వెళ్ల‌కండి. మీ రోగ నిరోధక శక్తిని పెంచుకోండి. మన భూ గ్రహాన్ని ఆరోగ్యంగా తయారు చేద్దాం* అంటూ పిలుపునిచ్చారు.

*భారతదేశం, ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు తమ హృదయపూర్వకమైన ఆకాంక్షలను పంచుకున్నారు. నన్ను పలకరించిన ప్రతి వ్యక్తికి నేను కృతజ్ఞుడిని. ఈ అభినందనలు నా తోటి పౌరుల జీవితాలను మెరుగుపరచడానికి, సేవ చేసేందుకు నాకు శక్తినిస్తాయి’ అని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ గురువారం నాడు 70వ వ‌డిలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version