ఏటా అంగరంగ వైభోగంగా జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. శ్రీవారికి ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు వచ్చాయి. దీనికి కారణం అధిక ఆశ్వీయుజమాసం రావడం. శనివారం అంటే సెప్టెంబర్ 19 నుంచి ఇవి ప్రారంభం అవుతున్నాయి.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి అధికమాస బ్రహ్మోత్సవాలను సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 19 నుండి 27వ తేదీ వరకు జరుగనున్నాయి. సాలకట్ల బ్రహోత్సవాలకు ఈ 18న అంకురార్పణ చేస్తారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈ 15న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ ఉత్సవాల్లో విశేషమైన రోజుల వివరాలిలా ఉన్నాయి.19న ధ్వజారోహణం, 23న గరుడసేవ, 24న స్వర్ణరథోత్సవం (సర్వభూపాల వాహనం),26న రథోత్సవం(సర్వభూపాల వాహనం), 27న – చక్రస్నానం, ధ్వజావరోహణం.కాగా కోవిడ్-19 నిబంధనల నేపథ్యంలో 24న స్వర్ణరథోత్సవం, 26న రథోత్సవం ఉండని కారణంగా ఈ రెండు రోజుల్లో సర్వభూపాల వాహనంపై శ్రీవారు ఉభయదేవేరులతో కలిసి వేంచేస్తారు.
– శ్రీ