చైనా దేశంలోని గ్యాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియన్ గేమ్స్ లో భారత దేశం నుండి ప్రాతినిధ్యం వహించిన ప్లేయర్లలో చాలా వరకు వివిధ విభాగాలలో పతకాలను సాధించారు. ఇక గతంలోని ఆసియన్ గేమ్స్ ఫలితాలని సరి చూసుకుంటే అంతకు ఇంచే ఈసారి పతకాలను భారత్ కొల్లగొట్టింది. కాగా ఈసారి క్రికెట్ ను కూడా ఆసియన్ గేమ్స్ లో ప్రవేశ పెట్టడంతో మరో రెండు పతకాలు దక్కనున్నాయి. అయితే భారత ప్రధాని నరేంద్ర మోదీ గ్లోబల్ లీడర్ గా ఎంత బిజీ గా ఉన్నప్పటికీ దేశం తరపున చైనాలో ఆడుతూ గర్వించేలా పతకాలను సాధిస్తున్న ప్రతి ఒక్కరినీ ట్విట్టర్ ద్వారా అభినందిస్తూ సక్సెస్ ను దేశ ప్రజలతో పంచుకుంటున్నాడు. ఆ విధంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటి వరకు 53 పోస్టులు చేసినట్లుగా సమాచారం ఉంది.
ఈ విధంగా ఎప్పటికప్పుడు స్పందించడం పట్ల ఆయనకు క్రీడల పట్ల మరియు దేశం పట్ల ఎంత అంకితభావం ఉందొ క్లియర్ గా అర్ధమవుతోంది.