నోరుజారిన నారా లోకేశ్‌.. థ్యాంక్స్‌ చెప్పిన మంత్రి రోజా

-

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు అన్యాయాన్ని చెబుతామని అంటున్నారని, ఇందుకు ఆయనకు థ్యాంక్స్ అని వైసీపీ నేత, మంత్రి రోజా అన్నారు. శుక్రవారం రాజమండ్రి జైల్లో చంద్రబాబుతో ములాఖత్ అనంతరం నారా లోకేశ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబుకు చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తామనే ఉద్దేశ్యంతో మాట్లాడబోయి, చంద్రబాబు చేసిన అన్యాయాన్ని అంటూ పొరపాటున మాట్లాడారు. ఈ వీడియో క్లిప్పింగ్‌ను రోజా ట్వీట్ చేస్తూ, లోకేశ్‌కు థ్యాంక్స్ చెప్పారు.

ఇది ఇలా ఉంటె, మంత్రి రోజాపై మాజీ మంత్రి,టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలపై నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ తీవ్రంగా మండిపడ్డారు. మంత్రి రోజాపై బండారు సత్యానారాయణ చేసిన చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఖుష్బూ సీరియస్ అయ్యారు. బండారు సత్యనారాయణ రోజాకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండింస్తున్నానని అన్నారు. బండారు ఓ రాజకీయ నాయకుడి గానే కాదు మనిషిగా కూడా విఫలమయ్యారంటూ ఫైర్ అయ్యారు. ఇది తాను రోజాకు ఓ స్నేహితురాలిగా కాదు సాటి మహిళగా మద్దతునిస్తున్నానని.. బండారు క్షమాపణ చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. బంగారు సత్యానారాయణ రోజాకు క్షమాపణలు చెప్పే వరకు తాను పోరాడతానని స్పష్టం చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version