బండి సంజయ్ కి ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్… అరెస్ట్ ఘటనపై ఆరా..!

-

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి ఫోన్ చేశారు. ఇటీవల జాగరణ దీక్ష చేస్తున్న క్రమంలో పోలీసులు బండి సంజయ్ ని అరెస్ట్ చేశారు. ఈవిషయంపై బండి సంజయ్ కి ఫోన్ చేసి పరామర్శించారు. ఘటనపై మోదీ ఆరా తీసినట్లు సమాచారం. అలాగే 317 జీవో గురించి ప్రధాని, బండి సంజయ్ ని అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. దీంతో పాటు ఇటీవల పంజాబ్ లో జరిగిన విషయాన్ని కూడా బండి సంజయ్, ప్రధాని మోదీతో ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

అయితే ఇటీవల ఉపాధ్యాయుల బదిలీ, 317 జీవోలో మార్పులు చేయాలని బీజేపీ పోరాడుతోంది. బీజేపీ నిరసనగా జాగరణ దీక్షకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే కోవిడ్ ఉల్లంఘనల పేరుతో బండి సంజయ్ ని పోలీసులు అరెస్ట్ చేయడం… జైలుకు తరలించడం తెలిసిందే. హైకోర్ట్ ఉత్తర్వులతో మళ్లీ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ అంశం రాజకీయంగా బీజేపీలో మంచి బూస్ట్ తెచ్చింది. స్టేట్ లీడర్లతో పాటు బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా, ఇతర కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత సీఎంలు బండి సంజయ్ ని పరామర్శించి.. కేంద్ర నాయకత్వం అడ్డాగా ఉంటుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version