మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా…? అయితే ఈ ఇంటి చిట్కాలు మీకోసం..!

-

చాలా మంది మోకాళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. మీకు కూడా ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు వస్తాయా..? అయితే తప్పకుండా ఈ చిట్కాలు మీరు చూడాల్సిందే. వీటిని కనుక అనుసరిస్తే మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. అలానే ఇబ్బందులు లేకుండా ఉంటుంది. అయితే మోకాళ్ళ నొప్పులు తగ్గాలంటే ఎలాంటి చిట్కాలని ఫాలో అవ్వాలి అనేది ఇప్పుడు చూద్దాం.

ప్రతి రోజూ వ్యాయామం చేయడం:

వ్యాయామం ఆరోగ్యానికి చాలా మంచిది. వ్యాయామం చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా కూడా బాగుంటుంది. ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల మోకాళ్ల నొప్పులు కలగకుండా ఉంటాయి. అలానే దృఢంగా మోకాళ్లు ఉంటాయి. వాకింగ్ చేయడం, యోగా, సైక్లింగ్, స్విమ్మింగ్ ఇలాంటి వాటిని ప్రయత్నం చేసి చూడండి.

బరువుని జాగ్రత్తగా చూసుకోండి:

మీరు కనుక బాగా బరువుగా ఉంటే కూడా మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే సరైన బరువు మెయింటెన్ చేసేటట్లు చూసుకోండి.

హీట్ అండ్ కోల్డ్ కంప్రెషన్:

ఇలా కంప్రెషన్ తో కూడా ఈ నొప్పులు తగ్గించుకోవచ్చు. పైగా దీని వలన చక్కటి రిలీఫ్ ఉంటుంది. ఇది మీ నొప్పిని తగ్గిస్తుంది.

మసాజ్ చేయండి:

నెమ్మదిగా మోకాళ్ళని మసాజ్ చేయడం వల్ల కూడా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అయితే మసాజ్ చేసినప్పుడు ఎక్కువ ప్రెషర్ పెట్టకండి. ఇలా ఈ జాగ్రత్తలు తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు నుంచి బయటపడొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version