వైసీపీ సీనియర్ నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై విజయవాడ పోలీసులు పోక్సో కేసు పెట్టారు. అంతేకాకుండా, నేడు విచారణకు హాజరుకావాలని సైబర్ క్రైమ్ పోలీసుల నోటీసులు ఇచ్చారు. దీనిపై గోరంట్ల మాధవ్ స్పందిస్తూ.. పోలీసుల విచారణకు హాజరవుతానని పేర్కొన్నారు.
కొన్ని అనివార్య కారణాల వల్ల విజయవాడకు వెళ్లలేకపోయానని మాజీ ఎంపీ పేర్కొన్నారు. వీలైతే బుధవారం సాయంత్రం లేదా రేపు విజయవాడకు వెళ్తానని గోరంట్ల మాధవ్ తెలిపారు. తన కోసం వైసీపీ లీగల్ టీమ్‌ను ఏర్పాటు చేసిందని,పార్టీ ఎప్పుడూ కార్యకర్తలకు అండగా ఉంటుందని గోరంట్ల మాధవ్ వెల్లడించారు.