ప్రేమంటే ఏమిటంటే?
ప్రేమంటే అదీ ఇదీ అని చెప్పుకునేది కాదు.. అనుభవించేది.
కారణమంటూ లేకుండా మనసుపై రాసుకున్న కవిత్వమే ప్రేమ.
ప్రేమించినవాళ్ళే అది చదవగలరు.
ఏదో ఇవ్వాలని ముందుకు వచ్చి అలా హత్తుకోవడం
ఆ కౌగిలింతకి నువ్వు కదిలి,
ఆ కుదుపుకి నీలో నవ్వులు పుట్టడమే ప్రేమ.
బాల్కానీలో కుండీలో నాటిన మొక్క
సడెన్ గా పువ్వు పూసినట్టు,
ఆరుబయట వాకిట్లో
అప్పుడే వర్షం పడినట్టు,
ఇంట్లో పడుకుంటే
నక్షత్రాలు కనిపించినట్టు,
వెన్నెల్లో నడిస్తే
చొక్కా తడిసినట్టు,
బకెట్లో నీళ్ళు ముంచితే,
సముద్రమే దిగివచ్చినట్టు,
అడుగులే పరుగులై
పరుగులే వరదలై
ఊగిపోతున్న నావని
తూగేలా తులతూగేలా చేసేదే ప్రేమ.
ప్రేమ రెండక్షరాలే.. అలా అనుకున్నవాళ్ళకి.
రెండు రూపాలే.. కామించినవాళ్ళకి.
రెండు జీవితాలే.. జీవించేవాళ్ళకి.
విదసీస్తే ఎన్నో అర్థాలు..
కలిస్తే ఒక్కటే.. అది ప్రేమే.
శ్రీరామ్ ప్రణతేజ.