పాక్-చైనాకు వ్యతిరేకంగా పీవోకేలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నీలం-జీలం నదిపై నిర్మించనున్న మెగా డ్యామ్‌లను వ్యతిరేకిస్తూ కాగడాలతో సోమవారం రాత్రి భారీ ఎత్తున నిరసన చేపట్టారు. ‘దర్యా బచావో…ముజఫరాబాద్ బచావో’, నీలం-జీలం బహ్నే దో.. హుమీన్ జిందా రెహ్నేదో’ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అలాగే పాకిస్తాన్-చైనాలకు వ్యతిరేకంగా ముజఫరాబాద్ నగరంలో అనేక మంది ఆందోళన చేపట్టారు. ‘సేవ్ రివర్స్ సేవ్ జమ్మూకశ్మీర్’ పేరుతో సోషల్ మీడియాలో నిరసన వ్యక్తం చేస్తున్నారు.
#WATCH: Protests and torch rally took place in Muzaffarabad city of Pakistan occupied Kashmir (PoK) last night, against the construction of mega-dams that will be built by Chinese firms on Neelum-Jhelum river. pic.twitter.com/aJhGPdfjnw
— ANI (@ANI) August 25, 2020
ఏ ప్రాతిపదికన పాకిస్థాన్-చైనా దేశాలు పీవోకేలో ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన ఒప్పందాలు చేకుంటున్నాయంటూ నిరసనకారులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇటీవల పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఆజాద్ పట్టాన్, కోహలా హైడ్రోపవర్ ప్రాజెక్టుల నిర్మాణానికి పాకిస్థాన్, చైనా ఒప్పందాలు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. కాగా, ఈ ప్రాజెక్ట్ 2026 నాటికి పూర్తవుతుందని పాకిస్తాన్ అధికారులు చెప్తున్నారు.