కాంగ్రెస్ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి బీజేపీ, ఆర్ఎస్‌ఎస్ నేతలపై విరుచుకపడ్డారు. ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయం కొత్త భవనానికి శంకుస్థాపన అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడారు.‘స్వాతంత్య్రాన్ని కించపరిచేలా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతున్నారు. బ్రిటీష్‌వారిపై పోరాడినవారిని ఆర్ఎస్ఎస్ చీఫ్ అవమానించారు. వాళ్లంతా ఒక ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు.
దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసేవారిని కాంగ్రెస్ మాత్రమే ఆపగలదు. ఆర్ఎస్ఎస్, బీజేపీపై మా పోరాటం కొనసాగుతుంది. మా పోరాటంలో న్యాయం ఉంది’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఇదిలాఉండగా, రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై అటు కేంద్రంలోని బీజేపీ పెద్దలు, బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన విధ్వంసాన్ని బీజేపీ రిపేర్ చేస్తోందని కౌంటర్ ఇస్తున్నారు.