కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఆర్మీ జనరల్…కరోనా నిర్ధారణ

-

ఇటీవల జర్మనీ లో జరిగిన ఒక కాన్ఫరెన్స్ లో పాల్గొని వచ్చిన పోలాండ్ భద్రతా దళాలకు చెందిన ఆర్మీ జనరల్ జారోస్లావ్ మికా కరోనా వైరస్ బారిన పడినట్లు తెలుస్తుంది. కాన్ఫరెన్స్ నుంచి తిరిగి వచ్చిన ఆయనకు స్వల్ప అస్వస్ధత గురికావడం తో అధికారులు కరోనా పరీక్షలు నిర్వహాయించగా పాజిటివ్ వచ్చింది. అయితే జర్మనీ లో మిలిటరీ కాన్ఫరెన్స్ తరవాతనే ఆయనకు కరోనా సోకినట్లు అధికారులు చెబుతున్నారు. జర్మనీలో ఒక సైన్యం సమావేశం నుండి తిరిగి వచ్చిన తరువాత, జనరల్ జరోస్లా మికాకు కరోనావైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది” అని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఈ కాన్ఫరెన్స్ కోసం మికాతో పాటు మరికొంత మంది అధికారులు కూడా ప్రయాణించగా ప్రస్తుతం వారిని ఐసోలేటెడ్ రూమ్స్ లోనే ఉంచినట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోపక్క ఈ కరోనా ప్రబలుతుండడం తో సామూహిక క్రీడా కార్యక్రమాలు మరియు కచేరి లు రద్దు చేసినట్లు తెలుస్తుంది. మరోపక్క మార్చి 6 న జరిగిన ఇదే జర్మనీ మిలిటరీ కాన్ఫరెన్స్ కు అమెరికా యూరప్ ఆర్మీ కమాండర్ కూడా హాజరైనట్లు తెలుస్తుంది. దీనితో అమెరికా కూడా అక్కడి పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తుంది.

ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా కరోనా కేసులతో సతమతమౌతుంది. మరి ఈ తాజా పరిణామం పై అమెరికా ఎలాంటి చర్యలకు పాల్పడుతుందో చూడాలి. చైనా లో మొదలైన ఈ మహమ్మారి ప్రపంచదేశాలకు పాకి అగ్రరాజ్యం అమెరికా లో ఈ వైరస్ తీవ్రంగా ప్రబలుతోంది. ఇప్పటికే ఈ వైరస్ సోకి ప్రపంచ వ్యాప్తంగా 4 వేల మందికి పైగా మృతువాత పడిన విషయం తెలిసిందే. రోజురోజుకు ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. అధికారులు ఎన్ని రకాలుగా చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా కరోనా మాత్రం విజృంభిస్తూనే ఉంది. భారత్ లో కూడా కొన్ని కరోనా కేసులు నమోదు కాగా ప్రస్తుతానికి పరిస్థితిమాత్రం అదుపులోనే ఉన్నట్లు తెలుస్తుంది,

Read more RELATED
Recommended to you

Exit mobile version