నిర్ణీత‌ గ‌డువు లోగా పోల‌వ‌రం పూర్తి కాదు : కేంద్రం

-

నిర్ణీత గ‌డువు లో పోల‌వ‌రం ప్రాజెక్ట్ ను పూర్తి చేయ‌డం సాధ్య కాద‌ని కేంద్ర ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. పోల‌వ‌రం ప్రాజెక్ట్ నిర్మాణ ప‌నులు కాస్త ఆల‌స్యం గా జ‌రుగుతున్నయ‌ని తెలిపారు. అందు కోసమే నిర్ణీత గ‌డువు లో ప్రాజెక్ట్ ను పూర్తి చేయ‌లేమ‌ని తేల్చి చేప్పారు. కాగ రాజ్య స‌భ లో ఆంధ్ర ప్ర‌దేశ్ నుంచి టీడీపీ ఎంపీ క‌న‌క‌మేడల ర‌వీంద్ర అడిగిన ప్ర‌శ్న కు జ‌వాబు గా కేంద్ర జ‌ల శ‌క్తి మంత్ర బిశ్వేశ్వ‌ర్ రాత పూర్వ‌కంగా స‌మాధానం ఇచ్చారు. పోల‌వ‌రం ప‌నుల్లో జాప్యం జ‌రుగుతుంద‌ని తెలిపారు.

పున‌రావాసం తో పాటు ప‌రిహారం విష‌యం లోనూ ఆల‌స్యం అవుతుంద‌ని తెలిపారు. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పోల‌వ‌రం ప్రాజెక్ట్ ను పూర్తి చేయాల‌ని అనుకున్నామ‌ని తెలిపారు. అయితే సాంకేతిక కార‌ణాల తో పాటు ప‌లు కార‌ణాల వ‌ల్ల ఆల‌స్యం అవుతున్నాయని స్ప‌ష్టం చేశారు. కాగ ఇప్ప‌టి వ‌ర‌కు స్పిల్ వే ఛాన‌ల్ 88 శాతం, అప్రొచ్ ఛాన‌ల్ ఎర్త్ వ‌ర్క్ ప‌నులు 73 శాతం, పైల‌ట్ ఛాన‌ల్ ప‌నులు 34 శాతం ప‌నులు మాత్ర‌మే పూర్తి అయ్యాయ‌ని కేంద్ర మంత్రి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version