నేపాల్‌‌ను తాకిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్

-

కొత్త వేరియంట్ ఒమిక్రాన్ హిమాలయ దేశం నేపాల్‌‌ను తాకింది. తమ దేశంలో తొలి కేసు నమోదైందని నేపాలీ అధికారులు ప్రకటించారు. నవంబర్ 19న నేపాల్‌కు వచ్చిన 66ఏండ్ల విదేశీయుడికి పాజిటివ్‌గా వచ్చిందని, జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించగా ఒమిక్రాన్ వేరియంట్‌గా నిర్ధారణ అయింది. అతడితో 71ఏండ్ల వృద్ధుడు కాంటాక్టులో ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఇద్దరిని ఐసోలేషన్‌లో ఉంచి వైద్యులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.

ఆ ఇద్దరితో కాంటాక్టులో ఉన్న ఆరుగురికి కొవిడ్ టెస్టు నిర్వహించగా అందరికీ నెగెటివ్ వచ్చింది. నేపాల్‌కు వచ్చే ముందు వారి ఆర్‌టీపీసీఆర్ టెస్టులో నెగెటివ్ వచ్చిందని, రెండు డోసుల వ్యాక్సిన్‌ కూడా తీసుకున్నారని నేపాలీ అధికారులు తెలిపారు. ఆ ఇద్దరి టూరిస్టుల నమూనాలను జినోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version