పోలవరం ప్రాజెక్టు ప్రమాదంలో పడింది. భారీ వర్షాలు అలాగే వరదల నేపద్యంలో… పోలవరానికి కొత్త సమస్య వచ్చి పడింది. తాజాగా పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యాం ఏడడుగుల మేరకు కుంగిపోయినట్లు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలవరం ప్రాజెక్టులో 10 అడుగుల వెడల్పు అలాగే ఏడు నుంచి 8 అడుగుల లోతుకు ఎగువ కాఫర్ డ్యాం పొందినట్లు సమాచారం అందుతుంది.

శుక్రవారం ఉదయం ఈ అంశాన్ని అధికారులు గుర్తించి అప్రమత్తమయ్యారట. దీనిపై ఆరా తీస్తున్నారు అధికారులు. తదుపరి చర్యలపై కూడా… అధికారుల ప్రత్యేక సమావేశం జరిగిందట. ఈ అంశాన్ని సీఎం చంద్రబాబు నాయుడు వద్దకు కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
7 అడుగుల లోతుకు కుంగిన పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యాం
ఏపీలోని పోలవరం ప్రాజెక్టులో 10 అడుగుల వెడల్పు, 7 నుండి 8 అడుగుల లోతుకు కుంగిన ఎగువ కాఫర్ డ్యాం
శుక్రవారం ఉదయం గమనించి అప్రమత్తమైన అధికారులు pic.twitter.com/cbM3cSci7n
— Telugu Scribe (@TeluguScribe) August 16, 2025