ఎన్టీఆర్ అభిమానులను హౌజ్ అరెస్ట్ చేస్తున్న పోలీసులు

-

ఎన్టీఆర్ అభిమానులకు బిగ్ షాక్ తగిలింది. ఎన్టీఆర్ అభిమానులను హౌజ్ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. జూనియర్ ఎన్టీఆర్ మీద అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో క్షమాపణ చెప్పాలంటూ ఎన్టీఆర్ అభిమానులు చేయాలనుకున్న ధర్నా నిలిపివేయాలంటూ మదనపల్లి ఎన్టీఆర్ అభిమాని టెంపర్ రాజేష్ హౌస్ అరెస్ట్ అయ్యారు. ఏపీలో మొత్తం ఇదే పరిస్థితి నెలకొందని అంటున్నారు.

ntr fans
ntr fans

వీడియో ద్వారా క్షమాపణలు చెప్పారు టిడిపి ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్. కానీ ఈ విషయంలో ఏ మాత్రం ఎన్టీఆర్ అభిమానులు తగ్గడం లేదు. బహిరంగ క్షమాపణలు చెప్పాలని.. జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి క్షమాపణలు కోరాలని.. డిమాండ్ చేస్తున్నారు అభిమానులు.

జూనియర్ ఎన్టీఆర్ తల్లికి ఒక న్యాయం ? చంద్రబాబు భార్య భువనేశ్వర్ కి ఒక న్యాయమా ? వెంటనే టిడిపి ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి ఆయన తల్లికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని కోరుతూ ఓ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news