అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ వర్సెస్ ఎన్టీఆర్ ఎపిసోడ్ లో కీలక పరిణామం చోటు చేసుకుందని సమాచారం. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తిగా భావిస్తున్న TNSF అధ్యక్షుడు ధనుంజయ నాయుడును బాగేపల్లి టోల్ ప్లాజా వద్ద అరెస్టు చేసినట్లు సమాచారం అందుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రాలేదు.

కాగా ఈ ఎపిసోడ్ పై ఇప్పటికే ఒక వీడియో ద్వారా క్షమాపణలు చెప్పారు టిడిపి ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్. కానీ ఈ విషయంలో ఏ మాత్రం ఎన్టీఆర్ అభిమానులు తగ్గడం లేదు. బహిరంగ క్షమాపణలు చెప్పాలని.. జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి క్షమాపణలు కోరాలని.. డిమాండ్ చేస్తున్నారు అభిమానులు.
జూనియర్ ఎన్టీఆర్ తల్లికి ఒక న్యాయం ? చంద్రబాబు భార్య భువనేశ్వర్ కి ఒక న్యాయమా ? వెంటనే టిడిపి ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి ఆయన తల్లికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని కోరుతూ ఓ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు.