వైఎస్సార్ సీపీ కీలక నేత బోరుగడ్డ అనిల్ కుమార్‌పై వరుసగా కేసులు నమోదువుతూనే ఉన్నాయి. గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆయన పలువురిని బెదిరింపులకు గురిచేయడంతో పాటు కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వ అధికారంలోకి రావడంతో ఆయనపై చర్యలకు దిగారు పోలీసులు.ఇప్పటికే టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న బోరుగడ్డ అనిల్ కుమార్‌ను పీటీ వారెంట్‌పై చిలకలపూడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం రాత్రి 2వ అదనపు జిల్లా జడ్జి ముందు బోరుగడ్డ అనిల్‌ను హాజరుపర్చిన పోలీసులు.. ఓ మైనర్ బాలిక మృతి కేసులో బెదిరింపులకు పాల్పడ్డారని 2019లో అనిల్ కుమార్ పై కేసు నమోదైంది. దీంతో బోరుగడ్డ అనిల్ కుమార్‌కు ఈనెల 27 వరకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు.