భయ్యా సన్నీ యాదవ్ పాపం పండింది : నా అన్వేషణ యూట్యూబర్

-

బెట్టింగ్ యాపులను ప్రమోట్ చేస్తూ అడ్డగోలుగా సంపాదిస్తూ యువతను చెడగొడుతున్న భయ్యా సన్నీ యాదవ్ అనే ఇన్ ఫ్లూయెన్సర్ మీద పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే అతన్ని అరెస్టు చేస్తామని పోలీసులు ప్రకటించారు. ఈ క్రమంలో యూట్యూబర్ నా అన్వేషణ తాజాగా భయ్యా సన్నీ యాదవ్ చేస్తున్న స్కాముల మీద స్పందించారు.

‘భయ్యా సన్నీ యాదవ్ పాపం పండింది. 2020లోనే సన్నీ స్కామ్స్ చేశాడు.బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల యువత పాడైపోతారని చెప్పినా వినలేదు. రోజుకో కొత్త కాన్సెప్ట్‌తో యువతను చెడగొట్టారు.రూ.8 కోట్ల ఇల్లు, జాగ్వర్ కారు, లక్షలు విలువ చేసే స్పోర్ట్స్ బైకులు..ఇవన్నీ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ద్వారానే వచ్చాయి. వంద గోడ్లను తిన్న రాబంధు..చిన్న గాలి వానకు నెలరాలింది అన్నట్లు సన్నీ యాదవ్ పనైపోయింది’ అని అన్వేష్ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news