గీతాంజలి ఆత్మహత్య కేసులో సైకోని అరెస్ట్ చేసిన పోలీసులు..

-

జరిగిన మేలుని మీడియాకు వివరించిందనే అక్కస్సుతో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా చేసిన వేధింపులకు అమాయక మహిళ బలైంది.. ఇద్దరు చిన్నారులు తల్లి లేక అనాథలయ్యారు.. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది మహిళా లోకం రోడ్డు ఎక్కి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తుంది.. గీతాంజలి ఆత్మకు శాంతి చేకూరాలంటూ కొవ్వొత్తుల ర్యాలీ చేస్తున్నారు మహిళలు.. ఈ నేపథ్యంలో గీతాంజలిని సోషల్ మీడియా వేదికగా అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు దృష్టి పెట్టారు. పసుమర్తి రాంబాబు అనే తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తను తెనాలి పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు.. ఇతను బోండా ఉమా కె అనుచరుడుగా ఉన్నారు.. ఇతను పెట్టిన పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారగా పోలీసులు దృష్టి పెట్టారు..

 

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏపీ పోలీసులు ఈ కేసు పై సీరియస్ గా దృష్టి పెట్టారు.. గీతాంజలి పట్టా పొందిన అనంతరం ఓ మీడియాకు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు.. నాకు ప్రభుత్వం నుంచి అనేక రకాలుగా లబ్ధి జరుగుతుందని.. జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందని ఆమె కి్తాబు ఇచ్చారు.. ఎక్కడా ప్రతిపక్షాలను ఉద్దేశించి విమర్శలు చేయలేదు.. కానీ తెలుగుదేశం పార్టీ జనసేన సోషల్ మీడియా కార్యకర్తలు ఆమెపై వ్యక్తిగతంగా పోస్టులు పెట్టారు.. అసభ్యకర పోస్ట్లు పెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో ఆమె మనోవేదనకి గురైందని కుటుంబ సభ్యులు తెలిపారు.. ఆమె ఆత్మహత్యానంతరం రాష్ట్రవ్యాప్తంగా ఈ విషయం సంచలనంగా మారింది.. ఆమెపై పోస్ట్లు పెట్టిన సైకోలను వెతికే పనిలో పడ్డారు పోలీసులు.. గురువారం ఉదయం తెనాలికి చిన్న రాంబాబుని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.. మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతుంది.. అరెస్ట్ల పరంపరం కొనసాగుతున్నట్టడంతో నిందితుల వేట మొదలైందని.. అందర్నీ కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి..

Read more RELATED
Recommended to you

Exit mobile version