తస్మాత్ జాగ్రత్త.. పేటీఎం పేరుతో మోసాలు..!

-

రోజురోజుకు టెక్నాలజీ పెరిగిపోవడమే కాదు సైబర్ నేరాలు కూడా రోజురోజుకు పెరిగి పోతూనే ఉన్నాయి. అధునాతన టెక్నాలజీని మంచి పనుల కోసం కాకుండా.. ప్రజలను బురిడీ కొట్టించేందుకే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఏటీఎం మోసాలు, ఆన్లైన్ పేమెంట్ మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఏదో ఒక విధంగా మాయ మాటలతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు కేటుగాళ్లు.

ముఖ్యంగా పేటీఎం కేవైసీ పేరుతో జరుగుతున్న మోసాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. పేటీఎం కేవైసీ పేరుతో ప్రజలకు మాయమాటలు చెప్పి భారీగా డబ్బులు దండుకుంటున్న ముఠాను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. వినయ్ అనే వ్యక్తి నుంచి పేటీఎం కేవైసీ పేరుతో ఏకంగా 4.29 లక్షల వరకు కేటుగాళ్లు కాజేశారు. పేటీఎం కేవైసీ పేరుతో ఫోన్ చేసి డెబిట్ కార్డ్ నుంచి ఒక రూపాయి పంపాలి అంటూ చెబుతారు ఆ తర్వాత పూర్తి వివరాలు సేకరించి ఖాతాలు ఖాళీ చేస్తూ ఉంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version