శబరిమల దర్శనానికి కీలక అంశాలు… ఆగ్రహం వ్యక్తం చేస్తున్న హిందూ సంఘాలు.

-

ప్రతి ఏడాది నవంబర్ 16 నుండి శబరిమల యాత్ర ప్రారంభం అవుతుంది అన్న సంగతి అందరికి తెలిసిందే. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కోవిడ్ సమస్య వల్ల కోవిడ్ నిబంధనలు కారణంగా ఈ ఏడాది జరిగే యాత్రపై ఇప్పటికే అనేక ఆంక్షలు విధించింది ప్రభుత్వం .ఈ నెల నవంబర్ 16 నుండి ప్రారంభం కానున్న యాత్ర పై తాజాగా మరికొన్ని ఆంక్షలను విధించినట్టు ప్రభుత్వం తెలిపింది. శబరిమల యాత్రలో అతి ముఖ్యమయిన పంబ నదిలో స్నానం చేయడం, స్వామికి నెయ్యిని అభిషేకం చేయడం వంటివి కొన్ని ముఖ్యమైన అంశాలు.

వీటిపై ఆంక్షలు విధించడంతో అటు హిందూ సంఘాలు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శబరిమల యాత్రలో అతి పవిత్రమైన, కీలకమైన అంశాలపై ఆంక్షలు విధించడం సరికాదని, ప్రభుత్వం ఎటువంటి సంఘాలను సంప్రదించకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పలువురు మత పెద్దలు . ఆంక్షలు వంటివి విధించాలి అనుకుంటే ఏకంగా యాత్రనే రద్దు చెయ్యాలని… లేకుంటే ఆంక్షలను ఎత్తివేయాలని పలు హిందూ సంఘాలు డిమాండ్ వ్యక్తం చేసారు. ఆంక్షలు ఎత్తివేయాలేని పక్షంలో హైకోర్టుకు వెళ్తామని కూడా హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version