చెన్నై: చెన్నైకి చెందిన విజయన్ భార్య కోసం పోలీస్ కమిషనర్ అవతారం ఎత్తి జైలు పాలయ్యాడు. లారీ వ్యాపారంలో నష్టాలు రావడంతో కొంతకాలం విజయన్ ఇంటిపట్టునే గడిపాడు. ఈ క్రమంలో భార్య ఏ పనిచేయడం లేదని నిలదీశారు. దీంతో గ్రూప్–1 పాసై పోలీస్ కమిషనర్‌గా ఉద్యోగోన్నతి పొందినట్లు అబద్ధం చెప్పారు. స్నేహితురాలి సహకారంతో సైరన్‌తో కూడిన పోలీస్ జీప్‌ను కొనుగోలు చేశారు. దాంతో పోలీస్ అధికారి అవతారమెత్తి పలువురి వద్ద డబ్బులు వసూలు చేశారు. కమిషనర్ గెటప్‌లో వెళ్తుండగా దిండుగల్లు జిల్లా లక్ష్మీపురం టోల్‌గేట్ వద్ద వాహనాల తనిఖీల్లో విజయన్ బాగోతం బయటపడింది.
భార్య కోసం పోలీస్ కమిషనర్ గెటప్.. చంద్రబాబు, పినరాయ్‌తో ఫొటోలు.. చివరకు..!
-