ప్రశాంతంగా ముగిసిన పోలీస్‌ కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్ష

-

కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షను విజయవంతగా పూర్తిచేశారు అధికారులు. రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో పోలీస్‌ కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. సివిల్‌, ట్రాన్స్‌పోర్టు, ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఆదివారం పరీక్షలు నిర్వహించింది. సివిల్‌ ఇతర విభాగాల్లో 15,644, రవాణాశాఖలో 63, ఎక్సైజ్‌శాఖలో 614 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి నియామకానికి గత ఏప్రిల్‌లో నోటిషికేషన్‌ విడుదల చేసిన విషయం విధితమే. ఆయా పోస్టులకు 6,61,196 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు.

ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగ్గా.. 6,03,955 మంది అభ్యర్థులు హాజరవగా.. 91.34శాతం హాజరు నమోదైందని టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ పేర్కొంది. హైదరాబాద్‌తో రాష్ట్రవ్యాప్తంగా 38 పట్టణాల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించినట్లు బోర్డు తెలిపింది. పరీక్షను షెడ్యూల్‌ ప్రకారం.. అన్ని నియమ నిబంధనల మేరకు.. సజావుగా నిర్వహించినట్లు చెప్పింది. పరీక్షకు హాజరైన అభ్యర్థుల బయోమెట్రిక్‌ హాజరు, వేలిముద్రల సేకరణ, డిజిటల్‌ విధానంలో ఫొటోలు సేకరించినట్లు పేర్కొంది. ప్రిలిమిని త్వరలోనే www.tslprb.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version