సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు నిన్న రాత్రి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడమే ఇందుకు కారణంగా తెలిసింది. తాజాగా గురువారం పోసాని అరెస్టుపై ఆయన భార్య స్పందించారు.
‘పోసాని ఆరోగ్యం బాలేదని చెప్పినా వినకుండా రాత్రికి రాత్రే పోలీసులు తీసుకెళ్లారు. వారు నాకు నోటీసులు ఇస్తే నేను తీసుకొను అని చెప్పాను. డే టైమ్ లో తీసుకెళ్లొచ్చు కదా ? నైట్ లోనే పోసానిని ఎందుకు తీసుకెళ్లారు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగితే ఏదో పోలీస్ స్టేషన్ పేరు చెప్పి హడావుడిగా తీసుకెళ్లారు’ అని ఆమె వెల్లడించారు.