మాజీ మంత్రి పేర్ని నానికి మంత్రి కొల్లు రవీంద్ర కౌంటర్ ఇచ్చారు. అక్రమ రేషన్ బియ్యంతోని ఎక్కడి నుంచి ఏ లారీ బయలుదేరింది.. చెక్ పోస్ట్ నుండి ఏ లారీ దాటింది పూర్తి వివరాలు ఉన్నాయి అని అన్నారు. అలాగే కాకినాడ షిప్పుల్లో అక్రమ బియ్యం రవాణా ఎలా జరిగింది అన్ని వివరాలు ఉన్నాయి. అదే విధంగా పేర్ని నాని అకౌంట్లో డబ్బులు ఎలా పడ్డాయి.. పేర్ని నాని భార్య పేర్ని జయసుధ ఎకౌంట్లో డబ్బులు ఎలా పడ్డాయి అన్ని బయటకు వస్తున్నాయి అని తెలిపారు.
దాంతో పేర్ని నాని వెంట్రుకలు కాదు మొత్తం పీకి పెడతాం. పేర్ని నాని నేనైతే ఎక్కడికి పారిపోలేదు అన్నాడు. కానీ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. నాటకాలు ఆడేది పేర్ని నాని కాబట్టి కాబట్టి ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించారు అని అన్నారు. ఇక పోసాని వైసీపీ హయాంలో ఎలా ప్రవరించాడో అందరికీ తెలుసు.. నోరు ఉంది కదా అని ఇష్టారాజ్యంగా మాట్లాడారు. చంద్రబాబు, పవన్, లోకేష్ కుటుంబ సభ్యులను దూషించారు. కాబట్టి అధర్మంగా ప్రవర్తించిన వారికి శిక్ష తప్పదు అని కొల్లు రవీంద్ర తెలిపారు.