కాంగ్రెస్‌ తుక్కుగూడ సభకు పోలీసులు గ్రీన్‌ సిగ్నల్‌.. కానీ..

-

కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో ఈ నెల 17వ తేదీన భారీ బహిరంగా సభను నిర్వహించాలని తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ భారీ బహిరంగా సభను నగర శివారులోని తుక్కుగూడలో నిర్వహించేందుకు కాంగ్రెస్ కసరత్తు మొదలు పెట్టింది. ఈ క్రమంలో పోలీసులు కాంగ్రెస్‌కు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెల 17వ తేదీన తుక్కుగూడలో తలపెట్టిన విజయభేరి బహిరంగ సభకు తాజాగా రాచకొండ పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. 25 నిబంధనలతో కాంగ్రెస్ సభకు రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ అనుమతి ఇచ్చారు. సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి 9 గంటలకు వరకు కాంగ్రెస్ సభకు పర్మిషన్ ఇచ్చారు. ఈ సభలో పదివేల మందికి మించకూడదని పోలీసులు నిబంధన విధించారు. ఓ పక్కా కాంగ్రెస్ లక్షల మందితో విజయభేరి సభను నిర్వహిస్తామని చెబుతుండగా.. పోలీసులు మాత్రం 10 వేల మందికే పర్మిషన్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.

అయితే.. నగర శివారులో వంద ఎకరాలకు పైగా ఖాళీ స్థలంలో నిర్వహించనున్న ఈ సభకు… భారీ సంఖ్యలో జనాన్ని తరలించాలని భావిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా మూడు రోజులపాటు స్థానిక నాయకత్వంతో ఏఐసీసీ పరిశీలకులు సమావేశాలు నిర్వహించి పోలింగ్‌ కేంద్రాల వారీగా.. పార్టీ కార్యకర్తలను తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇవాళ, రేపు కూడా నియోజకవర్గాల్లో సమీక్షలు నిర్వహించనున్న ఏఐసీసీ పరిశీలకులు.. స్థానిక నాయకుల సహకారంతో ఎంత మంది సభకు తరలివస్తారన్న దానిపై పీసీసీకి నివేదిక ఇస్తారు. అయితే హైదరాబాద్‌ నగరానికి దగ్గరగా ఉన్న జిల్లాల నుంచి అధిక సంఖ్యలో జనాన్ని తరలించాలని భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version