తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్

-

తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్. ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షల్లో 7 మార్కులు కలిపిన తర్వాత అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను TSLPRB నేటి నుంచి వెబ్ సైట్ లో ఉంచనుంది. 1 నుంచి 5 వరకు పార్ట్-2 దరఖాస్తు చేసుకోవచ్చు.

హాల్ టికెట్లు 8, 9, 10 తేదీల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇబ్బందులు ఎదురైతే support@tslprb.in, 9393711110, 9391005006 నంబర్లలో సంప్రదించాలి. 15 నుంచి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఎంబీఎన్ఆర్, నల్గొండ, అదిలాబాద్ లో ఈవెంట్స్ నిర్వహిస్తారు.

కాగా, నిన్న ఎస్సై, కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి బహుళ సమాధానాలు ఉన్న ఏడు ప్రశ్నలకు మార్కులను కలపాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని నిర్ణయించింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఉత్తీర్ణులైన వారి జాబితాను ఈనెల 30వ తేదీ నుంచి వెబ్సైట్ లో ఉంచనున్నారు. ఎస్సై, కానిస్టేబుల్ నియామకాల కోసం ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించారు.

అయితే కొన్ని ప్రశ్నలకు ఇచ్చిన ఆప్షన్లలో ఒకటి కంటే ఎక్కువ సరైన సమాధానాలు ఉన్నాయి. అయితే బోర్డు మాత్రం తాము నిరుద్ధరించుకున్న జవాబుల ప్రకారమే మార్కులు వేసి ఫలితాలను వెల్లడించింది. దీనిపై కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో అభ్యర్థుల పిటిషన్లను పరిశీలించిన కోర్టు బహుళ జవాబులు ఉన్న ప్రశ్నలకు వదనపు మార్కులు ఇవ్వాలని ఆదేశిస్తూ తీర్పు చెప్పింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version