ఆత్మహత్య చేసుకోబోయే అమ్మాయిని కాపాడిన తెలంగాణ పోలీసులు

-

ఇంట్లో చోటుచేసుకున్న గొడవల కారణంగా మనస్థాపానికి లోనైన ఓ అమ్మాయి ఆత్మహత్య చేసుకోబోయింది. అయితే దీనిని గుర్తించిన పోలీసులు.. ఆ అమ్మాయిని రక్షించి తల్లిదండ్రలు వద్దకు చేర్చారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల సమీపంలోని శ్రీరాంపూర్‌కు చెందిన సదరు యువతి మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్యకు యత్నించింది. లాక్ డౌన్ అమల్లో ఉండటంతో కాలినడకనే.. గోదావరి బ్రిడ్జ్ వైపు నడవడం మొదలుపెట్టింది. అమ్మాయి గోదావరి బ్రిడ్డి వైపు వెళ్లడం గమనించిన ఎస్సైలు విజేందర్, మంగిలాల్.. ఆమెను అడ్డకుని వివరాలు ఆరా తీశారు.

అనంతరం ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చి.. తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ విషయాన్ని రామగుండం సీపీ సత్యనారాయణ ట్విటర్ ద్వారా వెల్లడించారు. అయితే అమ్మాయి ఆత్మహత్య చేసుకోకుండా నిలువరించిన పోలీసులను డీజీపీ మహేందర్ రెడ్డి అభినందించారు. అమ్మాయిని కాపాడిన పోలీసులను డియర్ ఆఫీసర్స్ అంటూ సంభోదించిన డీజీపీ.. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు.

“విపరీతమైన భావోద్వేగాలు గొడవలకు, అపార్థాలకు దారితీస్తాయి.. ఇవి ఎవరికైనా చాలా ప్రమాదకరం. ఓ క్షణం ఆలోచిస్తే చాలా సమస్యలు పరిష్కరమవుతాయి. డియర్ ఆఫీసర్స్.. ఒత్తిడిలో ఉన్నవారి పట్ల మీరు చూపించిన శ్రద్ధ, చెప్పిన మాటలు సరైనవి” అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version