బ్రేకింగ్‌ : ఈటల మూడు వాహనాలు సీజ్‌, పీఆర్వో అరెస్ట్‌ !

-

మాజీ మంత్రి హుజురాబాద్‌ నియోజక వర్గ బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ కు బిగ్‌ షాక్‌ తగిలింది. హుజురాబాద్‌ ఉప ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియులో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కమలాపూర్‌ మండలం మరిపెల్లి గూడెం లో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ కాన్వాయ్‌ లోని ఏకంగా మూడు వాహనాలను ఎన్నికల అధికారులు సీజ్‌ చేశారు.

మూడు వాహానాలకు సరైన అనుమతి పత్రాలు లేనందున.. ఎన్నికల నియమావళిని అనుసరించి పోలీసులు సీజ్‌ చేశారు. ఈటల రాజేందర్‌ పీఆర్వో ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమచారం అందుతోంది. కాగా.. హుజురాబాద్‌ నియోజక వర్గ ఉప ఎన్నికల్లో పోలింగ్‌ రికార్డు స్థాయి లో నమోదవుతోంది. ఎప్పుడూ లేని విధంగా పోలింగ్‌ నమోదవుతోంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల సమయం వరకు ఏకంగా 61.66 శాతం పోలింగ్‌ జరిగిందని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. ఇక పోలింగ్‌ ముగిసే సరికి… పోలింగ్‌ శాతం 85 శాతానికి పైగా నమోదవుతుందని అధికారులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version