ఏపీలోని చిత్తూరు జిల్లాలో పోలీసుల బదిలీలపై మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మంగళవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.వైసీపీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న వారిని బదిలీ చేయమంటే.. అందరినీ బదిలీ చేసి వారి పెళ్ళాం పిల్లలు చేత నన్ను తిట్టించడం అంటూ వ్యంగంగా
వ్యాఖ్యానించారు.
టీడీపీ నాయకులు, ప్రజా ప్రతినిధుల సిఫార్సులను ఏమాత్రం పట్టించుకోకుండా పదవీ విరమణకు దగ్గరగా ఉన్న వారిని సైతం తమిళనాడు బోర్డర్‌కు బదిలీ చేశారంటూ ఇప్పటికే పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.