గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆదివారం రాత్రి ఓ యువతిపై ఎంఎంటీఎస్ రైలులో గంజాయికి బానిసైన ఓ దుండగుడు అత్యాచారం యత్నం చేయగా..సదరు యువతి భయపడి రైలు నుంచి కిందకు దూకిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బాధితురాలు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది. ఆమెను ప్రతిపక్ష పార్టీలకు చెందిన మాజీ మంత్రులు ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.
తాజాగా ఈ కేసులో కీలక పురోగతి చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని రైల్వే స్టేషన్ లలో ఉన్న సీసీ కెమెరాలను చెక్ చేశారు. అందులో రికార్డు అయిన వ్యక్తుల ఫోటోలను యువతికి చూపించగా.. నిందితుడిని బాధితురాలు గుర్తుపట్టింది.యువతి పై దాడికి యత్నించిన వ్యక్తి జంగం మహేష్‌గా గుర్తించారు.నిందితుడు గత కొంత కాలంగా గంజాయికి బానిసగా మారి ఇంటికి దూరంగా ఉంటున్నట్లు పోలీసులు నిర్ధారించగా.. అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
MMTSలో యువతిపై అత్యాచారయత్నం.. నిందితుడు ఇతనే
నిందితుడు గౌడవల్లికి చెందిన జంగం మహేశ్‌గా గుర్తింపు
మహేశ్ ఫోటోను బాధితురాలికి చూపించిన పోలీసులు
ఫోటో ఆధారంగా మహేశ్‌ను గుర్తించిన బాధిత యువతి
గంజాయికి బానిసైన మహేశ్ పాత నేరస్తుడిగా గుర్తింపు https://t.co/M2F1FzGrYM pic.twitter.com/XrhqDQGZEV
— BIG TV Breaking News (@bigtvtelugu) March 25, 2025