నర్సీపట్నంలో తీవ్ర ఉత్కంఠ.. పోలీస్ vs అయ్యన్న !

-

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ రోజు భారీ బైక్ ర్యాలీ కి తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడు సిద్ధమయ్యారు. అయితే ట్రాఫిక్ నిబంధనలతో పాటు కోవిడ్ నిబంధనలు అమలులో ఉండడంతో 30 మందికి మాత్రమే అనుమతి ఇస్తామని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ర్యాలీలో వాహనాల పరిమితిని సూచిస్తూ అయ్యన్నపాత్రుడుకి పోలీసులు నోటీసు ఇచ్చారు.

కానీ అయ్యన్నపాత్రుడు పోలీసుల నోటీసులు తీసుకోవడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది. ర్యాలీకి అనుమతులు ఇచ్చి ఇప్పుడు ఆంక్షలు పెడుతున్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాక తను ర్యాలీ నిర్వహించి తీరుతాం అని పోలీసులకు అయ్యన్నపాత్రుడు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు వర్సెస్ అయ్యన్నపాత్రుడు అనేటట్టుగా నర్సీపట్నంలో పరిస్థితి ఏర్పడింది. ఈ వ్యవహారం ఎంత దూరం వెళుతుంది అనేది చూడాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version