రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో మొత్తం 26 మందిపై పోలీసులు కేసులు నమోదు చేయగా.. అందులో సినీ సెలబ్రిటీలు సైతం ఉన్నారు. దగ్గుబాటి రానా, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి, ప్రణీత, విజయ్ దేవరకొండ వంటి వారిపై కూడా కేసులు నమోదయ్యాయి.
అయితే, సినీ ప్రముఖుల విచారణ విషయంలో పోలీసులు న్యాయ సలహా తీసుకునే ముందుకు వెళ్లాలని భావిస్తోన్నట్లు సమాచారం. యువతను తప్పుదారి పట్టించే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌తో భారీగా డబ్బులు సంపాదించిన సినీనటులు, ఇన్‌ఫ్లూయెన్సర్లుకు సదరు బెట్టింగ్ యాప్స్ కంపెనీల నుంచి ఏ విధంగా డబ్బులు అందాయి. ఏ ఏ మార్గాల్లో ప్రమోటర్లు అందుకున్నారనే విషయంలో వారి బ్యాంకు లావాదేవీలపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. అంతేకాకుండా వారి ఫ్యామిలీ మెంబర్స్ ఖాతాలు సైతం చెక్ చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.