లాక్ డౌన్ లో పోలీసులే కన్యాదానం చేసారు…!

-

ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితుల్లో పెళ్ళిళ్ళు అవ్వడం చాలా కష్టం. లాక్ డౌన్ అమలు కావడంతో పెళ్లి అయ్యే అవకాశం మాత్రం దేశంలో ఎక్కడా కూడా కనపడటం లేదు అనేది వాస్తవం. దీనితో పెళ్లి చేసుకోవాలి అనుకునే వారు చాలా మంది దొంగ చాటుగా పెళ్లి చేసుకోవడం లేదా ఎవరూ లేకుండా చూసి పెళ్లి చేసుకోవడం వంటివి చేస్తున్నారు. కాని తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక సంఘటనలో పోలీసులే పెళ్లి చేసారు.

తల్లి తండ్రుల అవతారం ఎత్తి కన్యాదానం చేసారు. ఓ డాక్టర్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ జంటకు వివాహం జరిపించేందుకు గానూ పోలీసులే అన్నీ తామై వ్యవహరించారు. పోలీసులు తెలిపిన వివరాలోకి వెళితే డెహ్రాడూన్ నగరానికి చెందిన అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్, వారి భార్య వరుడుకీ కన్యాదానం చేసారు. పెళ్లి తంతు మొత్తాన్ని ఇరు కుటుంబాలు వీడియో కాల్ లో చూసాయి. వివాహం చేయడం కోసం గానూ పోలీసులు అమనోరా క్లబ్ హౌస్‌ను బుక్ చేసి పూజారిని ఏర్పాటు చేసారు.

పెళ్లి కొడుకు ఆదిత్య సింగ్ బిస్త్ వివాహం పూర్తి అయిన తర్వాత మీడియాతో మాట్లాడాడు. డెహ్రాడూన్‌లో తమ వివాహం జరిపించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారని… లాక్‌డౌన్ కారణంగా తాము అక్కడికి వెళ్లే పరిస్థితి లేదన్నాడు. కాని మే 2న ముహూర్తం సమయానికే పోలీసులు తమ వివాహం జరిపించారు అని… తమ వివాహారానికి లాక్ డౌన్ అడ్డం ఉన్నా సరే పోలీసులే దగ్గర ఉండి వివాహం చేసారు అని పేర్కొన్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version