బీజేపీకి బిగ్‌ షాక్.. మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి

-

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల ముంగిట పంజాబ్ రాష్ట్రంలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ అద్మీ పార్టీ(ఆప్) కమలం, హస్తం పార్టీలకు షాక్ ఇచ్చింది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ అత్యధికంగా 9 సీట్లను కైవసం చేసుకున్నది. బీజేపీ ఆరు, కాంగ్రెస్ ఐదు స్థానాలు దక్కాయి.

AAP leader Arvind Kejriwal

ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల ప్రకారం బీజేపీకి చెందిన చండీగఢ్ మేయర్ రవికాంత్ శర్మ ఆప్ అభ్యర్థి దమన్‌ప్రీత్ సింగ్ చేతిలో ఓటమిపాలయ్యారు. పంజాబ్, హర్యానా ఉమ్మడి రాజధాని చండీగఢ్‌‌ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 35 కౌన్సిలర్ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరిగాయి.

చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ మొదటిసారి పోటీ చేసింది. మెజారిటీ స్థానాలు కలిగి ఉన్న బీజేపీ కి షాక్ ఇచ్చింది.

గతంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 20, మిత్రపక్షం అకాలీదల్‌కు 1 స్థానం దక్కగా, కాంగ్రెస్ నాలుగు స్థానాల్లో విజయం సాధించింది.

ప్రతి ఐదేండ్లకు జరిగే చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో చిరకాల ప్రత్యర్థులు బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ ఉండేది.

అయితే, వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్, ఆప్, బీజేపీ, అకాలీదల్- బీఎస్సీ మధ్య చతుర్మఖ పోటీ నెలకొన్నది.

Read more RELATED
Recommended to you

Exit mobile version