త్వరలోనే రాజకీయ పార్టీ పెడతా – తీన్మార్‌ మల్లన్న

-

బీజేపీ నేత, ప్రముఖ జర్నలిస్ట్‌ చింతపండు నవీన్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్న సంచలన ప్రకటన చేశాడు. తాను త్వరలోనే రాజకీయ పార్టీ పెడతానని తీన్మార్‌ మల్లన్న ప్రకటించారు. రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న దొంగల సంఖ్య 7200 అని, రాష్ట్ర సంపదను కొల్లగొడుతున్న ఆ 7200 మంది వెలమ దొరల భరతం పడతాన్ని హెచ్చరించారు.

తన కుటుంబసభ్యుల పేరు మీద ఉన్న ఆస్తులన్నీ ప్రభుత్వానికి రాసి ఇస్తానన్నారు. క్యూన్యూస్ ఛానల్‌ ద్వారా ప్రజల తరపున ప్రశ్నిస్తున్నాని వెల్లడించారు. క్యూన్యూస్ ఛానల్‌ను మూయించేందుకు కొందరు ప్రయత్నించారని,. 7200 పేరుతో త్వరలో 10 లక్షల మందితో భారీ సభ ఏర్పాటు చేస్తామని తీన్మార్ మల్లన్న ప్రకటించారు. అంబేద్కర్ ఆశయాలను ముందుకు పోతామని, రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామన్న మల్లన్న.. 7200లో ఉచిత విద్య, ఉచిత వైద్యం, ప్రజలకు సత్వర న్యాయం ప్రధానంగా ఉన్నాయన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version