యూరిన్ థెరపీ: తన మూత్రాన్ని తానే తాగుతున్న యువకుడు..!

-

ఎవడి పిచ్చి వాడికి ఆనందం.. కానీ కొన్నిసార్లు కొందరి పిచ్చి పనులు చూడాలన్నా, వినాలన్నా వికారం పుట్టేలా ఉంటాయి. అలాంటి వికారం పుట్టే పనిచేశాడు ఇంగ్లాండ్ కి చెందిన ఓ వ్యక్తి. ఇంగ్లాండ్ లోని హ్యాంప్ షేర్ కు చెందిన 34 ఏళ్ల హ్యారీ మాటాదీన్, రోజూ తన మూత్రాన్ని తానే తాగుతున్నాడు.అంతే కాదు అలా చేయడం వల్ల తనకున్న డిప్రెషన్ పోయిందని అంటున్నాడు.పైగా తన మూత్రాన్ని తానే తాగుతుందడంతో, తన వయసు కన్నా పది ఏళ్ళు చిన్నవాడిగా కనిపిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు హ్యారీ.అతనికి గతం లో మానసిక సమస్యలు ఉండేవి.వాటి నుంచి బయటపడాలని ఫిక్స్ అయ్యాడు.అందుకు అతను “యూరిన్ థెరపీని” ఎంచుకున్నాడు.2016 నుంచి తన మూత్రాన్ని తానే తాగుతున్నాడు.

అలా చేయడంతో తనకు ప్రశాంతతా, శాంతి, సంకల్ప భావాలు పెరిగినట్టు చెబుతున్నాడు హ్యారీ మాటాదీన్. అందరూ యూనియన్ థెరపీని ఎంచుకొని, ఎవరి మూత్రం వారే తాగాలని సూచిస్తున్నాడు.రోజుకు 200 ml మూత్రం తాగుతాడు.నెల రోజుల పాటు నిల్వ ఉంచిన మూత్రాన్ని తీసుకొని, అప్పుడే బయటకు వచ్చిన మూత్రాన్ని కలిపి తాగుతాడు.తన యూరిన్ ఎంతో క్లీన్ గా ఉంటుందని, వాసన, రుచి బాగుంటుందని ఇతరులకు వికారం వచ్చేలా చెబుతున్నాడు.యూరిన్ తాగడమే కాదు దానిని తన ముఖానికి కూడా రాసుకుంటాడు.ఈ విషయం తెలిసిన అతని కుటుంబ సభ్యులు అతడిని తిట్టారు.హ్యారీ చెల్లి అతనితో మాట్లాడటమే మానేసింది.కానీ చాలా మంది తనకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పాడు హ్యారీ.అతని ఇష్యు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version