వైసీపీలో సంబ‌రాలు.. టీడీపీలో అవ‌మానాలు.. వెర‌సి మారుతున్న పాలిటిక్స్

-

ఏడాది పాల‌న పూర్తి చేసుకున్న వైసీపీలో సంబ‌రాలు ఒక‌వైపు.. పాల‌న పోగొట్టుకుని, తీర‌ని అవ‌మానంతో ర‌గిలిపోతున్న ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ మ‌రోవైపు! దీంతో గ‌డిచిన నెల రోజులుగా ఏపీలో రాజ‌కీయాలు ఊ పందుకున్నాయి. ప్ర‌భుత్వం స‌హ‌జంగానే తాను చేసుకునే కార్య‌క్ర‌మాల‌ను హైలెట్ చేసుకునేందుకు ప్ర య‌త్నిస్తుంది. ఏడాది కాలంలో ప్ర‌జ‌ల‌కు చేసిన ప‌నులు, ప్ర‌జ‌ల కోసం చేప‌ట్టిన అభివృద్ధి కార్య‌క్ర‌మాలు వంటివి హైలెట్ చేస్తుంది. త‌ద్వారా ప్ర‌జ‌ల్లోకి మ‌రింత దూకుడుగా దూసుకుపోయేందుకు ప్ర‌య‌త్నిస్తుంది. అయితే, అదేస‌మ‌యంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి కూడా చెప్పుకొనేందుకు ఏమైనా ఉండాలి క‌దా?!

దుర‌దృష్టం ఏంటంటే.. టీడీపీ నేత‌ల‌కు ఈ ఏడాది కాలంలో చెప్పుకొనేందుకు ఏమీ మిగ‌ల్లేదు. పార్టీ నిర్వీర్యం అయ్యే దిశ‌గా అడుగులు ప‌డ‌డం, పార్టీలో భిన్న‌మైన రాజ‌కీయ కోణాలు క‌నిపిస్తుండ‌డం త‌ప్ప‌! ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వంపై ఎదురుదాడి చేసేందుకు, అడుగ‌డుగునా ప్ర‌భుత్వాన్ని అడ్డుకునేందుకు ప్ర‌తిప క్షం ప్ర‌య‌త్నిస్తోంది. ఇక్క‌డ అదృష్ట‌మో.. దుర‌దృష్ట‌మో.. ప్ర‌తిప‌క్షాన్ని స‌మ‌ర్ధించే మీడియా కూడా ప్ర‌భు త్వం చేసిన మంచి ప‌నులు క‌నీసం ప్ర‌స్థావించ‌డం మానేసింది.

ఎంత‌సేపూ ప్ర‌భుత్వాన్ని ఇబ్బందిలోకి నెట్టే కార్య‌క్ర‌మాల‌కు మాత్ర‌మే ప్రాధాన్యం ఇస్తోంది. ఈ ప‌రిణామాల‌తో రాజ‌కీయం వేడెక్కింది. ఇక‌, మ‌రో కీల‌క విష‌యం ఏంటంటే.. వైసీపీలో అంత‌ర్గ‌త చిచ్చు ర‌గులుకునేలా కూడా టీడీపీ తెర‌చాటున చ‌క్రం తిప్పుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు అంత‌గా మీడియా ముందుకు వ‌చ్చి సొంత పార్టీ నేత‌ల‌ను విమ‌ర్శించ‌డం వెనుక టీడీపీకి చెందిన కీల‌క నాయ‌కుడు తె ర వెనుక ఉన్నార‌నే ప్ర‌చారం సాగుతోంది.

2014లో ఎంపీ టికెట్ ఈయ‌న‌కు ఇప్పించేందుకు స‌ద‌రు నాయ ‌కుడు గ‌ట్టిగా కృషి చేశార‌ని.. ఆయ‌న పార్టీకి ఫండ్లు కూడా బాగానే ఇచ్చార‌ని ఇప్పుడు వైసీపీని ఇబ్బందు ల్లోకి నెట్టేందుకు ఉన్న అన్ని ఆయుధాల‌ను వినియోగించుకునే క్ర‌మంలోనే స‌ద‌రు ఎంపీని రంగంలోకి దింపార‌ని అంటున్నారు. ఇలా మొత్తంగా టీడీపీ ఈ ఏడాది కాలంలో తాను పొందిన అవ‌మానాన్ని ఇలా అధికార పార్టీపై తీర్చుకుంటోంద‌నే వ్యాఖ్య‌లు ఆ పార్టీ నేత‌ల నుంచే వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం

Read more RELATED
Recommended to you

Exit mobile version