బాబు-ధర్మాన క్లోజ్..బీజేపీ ఏం చేస్తుందో?

-

రాష్ట్రంలో సమస్యలు పరిష్కరించి పెద్దన్న పాత్రలో ఉండాల్సిన కేంద్ర ప్రభుత్వం..రాష్ట్రానికి అనుకున్న మేర సాయం చేయడంలో గాని, విభజన హామిలి అమలు చేయడంలో గాని విఫలమయ్యారు. పైగా వైసీపీ-టీడీపీల మధ్య దారుణమైన రాజకీయ యుద్ధం జరుగుతుంటే చూస్తూ వేడుక చూస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ ఏం చేస్తుందో అందరికీ తెలుసు. కానీ రాష్ట్రాన్ని బీజేపీ చూసుకుంటుందన్నట్లు ఎంపీ జీవీఎల్ నరసింహారావు చెప్పుకొస్తున్నారు.

పోలవరం నిర్మాణం ఆలస్యంకు వైసీపీ ప్రభుత్వం చేతకాని తనం కారణమని, కేంద్రం నిధులిస్తే ప్రాజెక్ట్ ప్రారంభించిన చంద్రబాబు కమీషన్ల కోసం పోలవరం తీసుకున్నారని చెప్పారు. విశాఖ భూ దోపిడీలో టీడీపీ, వైసీపీ తోడు దొంగలు అని, రెండు సిట్‌లు ఏర్పాటు చేసిన ఎందుకు నివేదికలు బయటపెట్టలేదని, మంత్రి ధర్మాన ప్రసాదరావుకు, చంద్రబాబు  ఉన్న లాలూచీ ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. అంటే విశాఖ భూ కబ్జాలు వైసీపీ, టీడీపీ నేతలు చేసి..ఇద్దరు కలిసికట్టుగా ఉన్నారని జీవీఎల్ ఆరోపిస్తున్నారు. చివరిగా ప్రధాన ప్రత్యామ్నాయంగా బీజేపీ, జనసేనలే నిలబడతాయన్నారు.

అయితే జీవీఎల్ విమర్శలు బాగానే ఉన్నాయి గాని..అసలు పోలవరంకు సరిగ్గా నిధులు ఇవ్వకుండా ఆలస్యం చేస్తుందే కేంద్ర ప్రభుత్వం ఆ విషయం అందరికీ అర్ధమవుతుంది. ఒకవేళ గతంలో చంద్రబాబు పోలవరంలో కమీషన్లు తీసుకుంటే..కేంద్రంలో అధికారంలో ఉండి ఎందుకు చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు వైసీపీ ప్రాజెక్ట్ ఆలస్యం చేస్తుంటే..ఎందుకు వేగంగా చేయాలని చెప్పడం లేదు.

ఇక విశాఖ భూ కబ్జాలు జరుగుతున్నప్పుడు..కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తుకు ఆదేశించవచ్చు. రాష్ట్రంలో ప్రధాన పార్టీలు కొట్టుకుంటుంటే బీజేపీ వేడుక చూస్తున్నట్లు కనిపిస్తోంది. అసలు ఏది చేయాలనుకున్న కేంద్రం చేయవచ్చు. కానీ అవేమీ చేయరు..సమస్యలని పరిష్కరించరు. ఇంకా సమస్యలు పెంచి, గొడవలు పెంచేలా చేస్తారు. రాష్ట్రానికి అనుకున్న మేర సాయం చేయరు. కానీ ఇలాంటి రాజకీయ విమర్శలు మాత్రం చేస్తూ ఉంటారు. ఏదేమైనా బీజేపీ డబుల్ గేమ్ వేరు అని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version