చేతులెత్తేసిన కమలం..మాటలు మారుతున్నాయి.!

-

తెలంగాణలో బీజేపీ చేతులెత్తేస్తుందా..ఇంకా రేసు నుంచి సైడ్ అవుతున్నట్లే ఉందా? కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం, ఆ ప్రభావం తెలంగాణపై పూర్తిగా పడిందా..నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారా? బి‌జే‌పిలో చేరికలకు ఇంకా బ్రేకులు పడిపోయినట్లేనా..బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే వార్ జరగనుందా? అంటే ప్రస్తుతం పరిస్తితులని గమనిస్తుంటే అలాగే కనిపిస్తుంది. మునుగోడు ఉపఎన్నికల వరకు తెలంగాణలో బి‌జే‌పి దూకుడు మీద ఉంది. ఆ పార్టీలో చేరికలు పెద్ద ఎత్తున జరిగాయి.

ఎప్పుడైతే ఎమ్మెల్యేల కొనుగోలు తెరపైకి వచ్చిందో అప్పటినుంచి సీన్ మారిపోయింది. బి‌జే‌పిలో దూకుడు తగ్గింది..చేరికలకు గ్యాప్ వచ్చింది. చేరికల కమిటీ ఛైర్మన్ గా ఉన్న ఈటల రాజేందర్ ఎంత ట్రై చేసిన..బి‌జే‌పిలోకి కొత్త నేతలు రావడం లేదు. పైగా ఇటీవల కాలంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులని చేర్చుకోవడానికి ఈటల గట్టిగానే కష్టపడ్డారు. కానీ వారు బి‌జే‌పిలో చేరడానికి ఆసక్తి చూపడం లేదని, పైగా తననే బి‌జే‌పి వదిలి..తమతో కలవాలని రివర్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నారని, ఖమ్మంలో కాంగ్రెస్ బలంగా ఉందని, బి‌జే‌పిలో చేరికలు కష్టమే అని ఈటల తాజాగా తేల్చి చెప్పేశారు. బి‌జే‌పి పుంజుకోవడం కష్టమే అంటున్నారు.

ఇక ఇద్దరు నేతలని బి‌జే‌పిలో చేర్చడంలో ఈటల ఫెయిల్ అయ్యారని, కర్నాటక ఎన్నికల తర్వాత బి‌జే‌పి గ్రాఫ్ పడిపోయిందని, తెలంగాణలో బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ తో పోలిస్తే బి‌జే‌పికి మూడో స్థానమే అని బి‌జే‌పి నేత కపిలవాయి దిలీప్ కుమార్ అంటున్నారు. ఆ మధ్య సోనియా, రాహుల్ గాంధీలపై అభిమానం తగ్గలేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్ చేశారు.

బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉందన్న అభిప్రాయం ప్రజల్లో ఉందని కొండా విశ్వేశ్వరెడ్డి అన్నారు. ఇలా బి‌జే‌పి నేతల్లోనే కాన్ఫిడెన్స్ తక్కువగా ఉంది..ఇంకా బి‌జే‌పి బలపడదని భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version