Congress party: ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం…ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కంచుకోట..ఇక ఇది రిజర్వడ్ నియోజకవర్గంగా మారక..బిఆర్‌ఎస్ పార్టీ హవా నడుస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ 4 సార్లు వరకు గెలిచింది..కాంగ్రెస్ నుంచి దామోదర్ గెలిచారు. ఇటు టిడిపి రెండు సార్లు గెలిచింది. అయితే రాష్ట్ర విభజన జరిగాక 2014, 2018 ఎన్నికల్లో బిఆర్‌ఎస్ వరుసగా గెలిచింది. కానీ అది కూడా అదృష్టం కొద్ది గెలవడమే.
బిఆర్‌ఎస్ నుంచి గాదరి కిషోర్, కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్ పోటీ పడుతూ వచ్చారు. 2014 ఎన్నికల్లో బిఆర్‌ఎస్ నుంచి గాదరి, కాంగ్రెస్ నుంచి అద్దంకి పోటీ పడ్డారు. హోరాహోరీగా వీరి మధ్య పోరు నడవగా కేవలం 2,379 ఓట్ల తేడాతో గాదరి గెలిచారు. అప్పుడు టిడిపి 31 వేల ఓట్లు వరకు తెచ్చుకుంది. టిడిపి ఓట్ల చీలిక ప్రభావం వల్ల ఫలితం మారింది. ఇక 2018 ఎన్నికల్లో గాదరికి మళ్ళీ అదృష్టం కలిసొచ్చింది. కేవలం 1847 ఓట్ల తేడాతో గాదరి మళ్ళీ అద్దంకి పై గెలిచారు.
ఇలా గాదరి రెండుసార్లు అదృష్టం కొద్దే గెలిచారు. అయితే ఇప్పుడు మూడోసారి 50 వేల ఓట్ల మెజారిటీతో గెలవాలని, గెలిచి హ్యాట్రిక్ కొట్టి, మంత్రి పదవి కూడా చేపట్టాలని గాదరి కలలు కంటున్నారు. అయితే ఆ కలలని దెబ్బతీయాలని కాంగ్రెస్ నేత అద్దంకి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు తక్కువ ఓట్లతో ఓడిపోయిన సానుభూతి ఆయనపై ఉంది.
ఈ క్రమంలో అద్దంకి..గాదరికి మళ్ళీ గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. గాదరి అనుకున్నట్లు ఈ సారి 50 వేల మెజారిటీ కాదు కదా..గెలవడమే కష్టమనే పరిస్తితి ఉంది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్తితి కాస్త దయనీయంగా ఉంది. ఒకవేళ కాంగ్రెస్ పికప్ అయితే అద్దంకికు బెనిఫిట్ అవుతుంది చూడాలి మరి ఈ సారి తుంగతుర్తిలో అదృష్టం ఎవరికి కలిసొస్తుందో.