2019 సార్వత్రిక ఎన్నికలలో నిజామాబాద్ పార్లమెంట్ నుండి టిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసినా కవిత ఓడిపోవడం జరిగింది. ఆ టైంలో కవితపై బిజెపి పార్టీ గెలవడం జరిగింది. దీంతో తెలంగాణలో బిజెపి పార్టీకి బలం పెరిగిందని అప్పట్లో చాలామంది మాట్లాడటం జరిగింది. ఈ ఓటమితో దాదాపు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన కవిత తాజాగా మళ్లీ ఇటీవల ఎమ్మెల్సీ గా ఎంట్రీ ఇవ్వటం జరిగింది.
నామినేషన్ వేసిన తర్వాత కవితకి స్వయంగా ఈ శుభవార్త ని అన్నయ్య కేటీఆర్ చెప్పినట్లు టిఆర్ఎస్ పార్టీలో గుసగుసలు వినబడుతున్నాయి. మొత్తంమీద చూసుకుంటే చాన్నాళ్ల తర్వాత మళ్ళీ కవిత యాక్టివ్ పాలిటిక్స్ లోకి అడుగుపెట్టనున్నారు.