బీఆర్ఎస్ ను టార్గెట్ చేసిన ఎంఐఎం.. వారిద్దరి మధ్య మాటల యుద్దం తప్పదా..

-

అధికారంలో ఉన్న సమయంలో దోస్త్ మేరా దో్స్త్ అంటూ డ్యూయేట్స్ పాడుకున్న ఈ రెండు పార్టీల మధ్య.. పొలిటికల్ బ్రేకప్ తప్పదా..? బీఆర్ఎస్ ను టార్గెట్ గా చేసుకుని ఎంఐఎం అధినేత మాటల యుద్దం వెనుక ఉన్న కారణాలేంటి..? నిన్నమొన్నటి వరకు తామంతా ఒక్కటేనన ఆ ఇద్దరు పొలిటికల్ వార్ కు సిద్దమవుతున్నారా..అంటే అవుననే సమాధానమొస్తోంది.. గత ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి సైలెంట్‌గా ఉన్న ఎంఐఎం.. ఇప్పుడు బీఆర్ఎస్‌పై సీరియస్ అవుతోంది.. ఈ వ్యవహారం ఇప్పుడు తెలంగాణా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది..

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఎంఐఎం సైలెంట్ అయింది.. బీఆర్ఎస్ కు ఎక్కడా మద్దతుగామాట్లాడలేదు.. అలాగానీ విమర్శలూ చెయ్యలేదు.. కానీ మొదటి సారి ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ.. బీఆర్ఎస్ లక్ష్యంగా విమర్శలు చేశారు..ఇక మనిద్దరికి వైరం తప్పదన్నట్లు డైలాగులు పేల్చారు.. తమకు కూడా రాజకీయం తెలుసని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. ప్రస్తుతం ఇవి రెండు పార్టీల్లో రాజకీయ చర్చలకు దారి తీస్తున్నాయి..

కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా జైనూర్‌లో ఆదివాసీ మహిళపై అత్యాచారం, హత్యాయత్నం ఘటన జరిగింది.. ఇది పెద్ద హింసకు దారి తీసింది.. రాజకీయంగానూ ఇది ఇరుపార్టీల మధ్య మాటల యుద్దం నడిచింది.. ఇక ఇదే ఘటనపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఘాటుగా రియాక్ట్‌ అయ్యారు. ఎన్నడూలేనిది.. బీఆర్ఎస్‌పై ఆయన భగ్గుమన్నారు. అల్లర్ల కేసుల్లో బీజేపీ నేతల కంటే.. బీఆర్ఎస్‌ నేతలే ఎక్కువ చేశారని.. వారే నిందితులుగా ఉన్నారని వ్యాఖ్యానించారు.. వక్ప్ బోర్డు బిల్లుపై వారి స్టాండ్ చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు.. ఇలాంటి మాటలు అసదుద్దీన్ నుంచి బీఆర్ఎస్ ఊహించలేదు.. దీంతో బీఆర్ఎస్ షాకైంది.. దీనిపై బీఆర్ఎస్ నేతలు ఇంత వరకు స్పందించలేదు.. వీరి రాజకీయం ఎటువైపుకు దారి తీస్తోందోనన్న చర్చ సాగుతోంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version