ప్రేమని అర్థం చేసుకోవడానికి మాటలు అవసరం లేదు. కొన్ని మార్పులు, మాటలు, చేతలు ద్వారా ప్రేమిస్తున్నారని చెప్పొచ్చు. ఒక అబ్బాయి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడో లేదో అనే సందేహం మీకు ఉన్నట్లయితే.. వీటి ద్వారా కనిపెట్టొచ్చు. మరి మీ సందేహాన్ని ఇప్పుడే క్లియర్ చేసుకోండి.
మీ కళ్ళల్లోకి చూస్తూ అందరూ మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రేమించే వ్యక్తి కళ్ళల్లోకి చూసి మాట్లాడలేరు. అలా మాట్లాడుతున్నట్లయితే తేడా కనిపిస్తుంది. ఆ వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడుతున్నాడని ఇది సంకేతం. ఈ చిన్న పని ద్వారా మనం ప్రేమను తెలుసుకోవచ్చు. అలాగే ఈ రోజుల్లో అమ్మాయిలకు అబ్బాయిల్లో స్నేహితులు ఉంటున్నారు. చాలా మంచి సంబంధాలు వాళ్ళ మధ్య ఉంటున్నాయి. మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తి మీ స్నేహితునికి భిన్నంగా ఉంటారు. మీ చేతులు తాకాల్సి వచ్చినా తడబడతారు. ఇలా స్పర్శలో తేడా వస్తే కూడా ప్రేమిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు.
మీతో మాట్లాడేటప్పుడు అధైర్యపడతాడు. వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ధైర్యంగా ఉంటాడు. కొంచెం సిగ్గు పడుతున్నట్లు కూడా కనబడుతూ ఉంటారు. అలా వాళ్లు ప్రేమిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు.
సమస్య ఏదైనా సరే మీకోసం నిలబడితే మీ మీద చాలా ఇష్టం ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు. మీరే సమస్య పరిష్కరించుకుంటారని వదిలేస్తే ప్రేమలో లేరని అర్థం చేసుకోవచ్చు. సో మీకోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లయితే వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారని మీరు తెలుసుకోవచ్చు.
అలాగే అందరితో కలిసి ఉన్నా అతను దృష్టి మీ మీద ఉందంటే మిమ్మల్ని ఇష్టపడుతున్నారని స్పష్టంగా చెప్పే సూచన. మీ మాటలు వినడం, ఏం చెప్పినా శ్రద్ధ పెట్టడం, అర్థం చేసుకోవడం, విలువ ఇవ్వడం ఈ లక్షణాలన్నీ కూడా ప్రేమిస్తున్నారని చెప్పడానికి సంకేతమే.