కాంగ్రెస్​ పార్టీకి రాజీనామా చేసే ప్రసక్తే లేదు : మహేశ్వర్ రెడ్డి

-

తెలంగాణ కాంగ్రెస్‌లో ముసలం రోజురోజుకు ముదురుతోంది. పార్టీ రాష్ట్ర నాయకత్వంపై చాలా మంది నేతలు అసంతృప్తిగా ఉన్నారు. వారంతా బహిరంగంగానే పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడారు. తాజాగా కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, మర్రి శశిధర్​ రెడ్డిలు కూడా పార్టీ వీడే అవకాశముందనే పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఇద్దరు నాయకులు పార్టీ నాయకత్వంపై బహిరంగంగా చేసిన విమర్శలు దీనికి ఊతమిస్తున్నాయి. తాజాగా ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డి కూడా కాంగ్రెస్​ను వీడుతున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. దీనిపై స్వయంగా ఆయనే స్పందించారు.

పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు నిన్నటి నుంచి మీడియాలో తనపై కథనాలు రావడం బాధ కలిగించిందని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తా అని ఎక్కడా చెప్పలేదు కానీ రాజీనామా చేస్తున్నట్టు మీడియాలో వచ్చిందని పేర్కొన్నారు. వెంటనే ఆ వార్తను ఖండించానన్నారు. కాంగ్రెస్‌లోనే ఉంటానని బహిరంగంగా ప్రకటించా.. రాజీనామా చేసే ప్రసక్తే లేదు.. అలాంటి అవకాశం రాదన్నారు.

‘నేను కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తా అని చెప్పలేదు. నా రాజీనామా వార్తలు బాధకలిగించాయి. కాంగ్రెస్‌లోనే ఉంటానని బహిరంగంగా ప్రకటించా. ఏదైనా సమస్య ఉంటే డైరెక్ట్‌గా మాట్లాడే వ్యక్తిని. రాజీనామా చేసే ప్రసక్తి లేదు.. అలాంటి అవకాశం రాదు. మర్రి శశిధర్‌రెడ్డి కాంగ్రెస్‌లోనే ఉంటారు. మాణికం ఠాగూర్ నాకు మంచి మిత్రుడు. మాణికం ఠాగూర్‌కు నాకు ఎలాంటి విభేదాలు లేవు. నాకు కాంగ్రెస్ మంచి గౌరవం ఇచ్చింది.’-మహేశ్వర్‌ రెడ్డి, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్

Read more RELATED
Recommended to you

Exit mobile version