మంత్రి పదవి ఇవ్వకుంటే రాజీనామా చేస్తానని ఓ పత్రికలో వచ్చినప్పుడు ఖండించానని… మేం వైఎస్సార్సీపీ పార్టీకి, వైఎస్ఆర్ ఫ్యామిలీకి, జగన్ కు విధేయులం అని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంత్రి పదవి అనేది ముఖ్యమంత్రి ఆలోచన ప్రకారం జరుగుతుందని… జగన్ మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో నాలుగేళ్ల మంత్రి పదవిని వదిలిపెట్టి వచ్చానని…. మంత్రి పదవి కోసం పాకులాడింది లేదని బాలినేని అన్నారు. ముఖ్యమంత్రి 25 మంది మంత్రులను తీసివేస్తాం అని అన్నప్పుడు కూడా ముందుగా స్టేట్ మెంట్ ఇచ్చింది నేనే అని బాలినేని అన్నారు.
మంత్రి పదవికి ఎప్పుడూ పాకులాడ లేదు….నేను వైఎస్ కుటుంబానికి విధేయుడిని: బాలినేని శ్రీనివాస్ రెడ్డి
-