Agent: ‘ఏజెంట్’గా అక్కినేని అఖిల్ స్టైలిష్ లుక్..వైజాగ్‌లో రచ్చరచ్చ చేసిన అభిమానులు

-

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రంలో సక్సెస్ అందుకున్నారు. చాలా కాలం నుంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తుండగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రంతో విజయం సాధించాడు. ఇందులో అఖిల్ కు జోడీగా టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించింది. కాగా, అఖిల్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘ఏజెంట్’.

స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపైన భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఇందులో మాలీవుడ్ (మలయాళం)మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా షూటింగ్ ప్రజెంట్ ఏపీలోని వైజాగ్ లో జరుగుతున్నది. సోమవారం షూటింగ్ నిమిత్తం హీరో అఖిల్ స్పెషల్ ఏరో ప్లేన్ లో వైజాగ్ వెళ్లగా, అక్కడ యంగ్ హీరోకు అభిమానులు ఘన స్వాగతం పలికారు.

అఖిల్ ను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఇందులో హీరోయిన్ గా సాక్షి వైద్య నటిస్తోంది.

ఈ ఏడాది ఆగస్టు 12న సినిమా విడుదల కానుంది. హిప్ హాప్ తమిజా ఈ పిక్చర్ కు మ్యూజిక్ అందిస్తుండగా, ఈ చిత్రం కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడు. సిక్స్ ప్యాక్ బాడీ కోసం డైట్ ఫాలో అయ్యాడు. ఫుల్ యాక్షన్ మోడ్ లో సినిమా వేరే లెవల్ లో ఉండబోతున్నదని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘సైరా నరసింహారెడ్డి ’ఫిల్మ్ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇది.

Read more RELATED
Recommended to you

Exit mobile version