ఎలాగైనా గెలవాలన్న రీతిలో చంద్రబాబు.. జగనే కావాలంటున్న జనాలు

-

ఏపీలో రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. మరి కొన్ని నెలల్లో ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని అన్ని పార్టీలు ఇప్పటి నుంచే జోరుగా ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల కారణంగా మరో సారి అధికారంలోకి రావడం ఖాయంగా తెలుస్తోంది. ఈ సారి ఎలాగైనా వైసీపీని అధికారంలోకి రాకుండా చేయాలని ప్రతిపక్షాలన్నీ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో దొరికిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ ప్రభుత్వంపై దుమ్మెతిపోసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే రాజకీయ దాడులకు కూడా పాల్పడుతున్నాయి.

 

టీడీపీ నేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఏపీలో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం పుంగనూరులో టౌన్లోకి వెళ్లేందుకు అనుమతి తప్పనిసరన్న పోలీసులను బెదిరించి… వారిపై దాడి చేసి నగరంలోకి ప్రవేశించారు నారా లోకేష్. ఈ దాడుల్లో పలువురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రజల దృష్టిలో తాను హీరోను అవ్వడం కోసం పోలీసులపై దాడికి రెచ్చగొట్టి చంద్రబాబు నెమ్మదిగా జారుకున్నారు. ఈ దాడుల్లో చాలామంది టీడీపీ కార్యకర్తలు కూడా గాయపడ్డారు. ఈ దాడిలో చంద్రబాబు వేసిన స్కెచ్ సక్సెస్ అయింది. పదుల సంఖ్యలో పోలీసులు ఆస్పత్రిపాలయ్యారు.

పుంగనూరులో జరిగినట్లే ప్రస్తుతం భీమవరంలో కూడా అలాంటి పరిణామాలు తలెత్తడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ప్రశాంతంగంగా ఉండే భీమవరంలో టీడీపీ నేతలు ఉద్దేశ పూర్వకంగానే వైసీపీ కేడర్ పైన దాడులు చేశారు. రెచ్చ గొట్టే ప్రసంగాలు చేసినందుకుగాను నారా లోకేశ్ కు భీమవరం పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. మొన్న చంద్రబాబు పుంగనూరు.. నేడు లోకేశ్ భీమవరం పర్యటనల్లో ఒకే పరిస్థితి కనిపిస్తోంది. పుంగనూరులో టీడీపీ ఇంచార్జ్ చల్లా బాబు సారధ్యంలో హింసకు ప్లాన్ చేసినట్లే ఇప్పుడు గోదావరి జిల్లాలో కూడా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సారధ్యంలో టీడీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులపై చెలరేగి పోయారు. లోకేష్ పాదయాత్ర సాగుతుండగానే కర్రలు.. బీర్ సీసాలు, రాళ్లతో వైసీపీ కార్యకర్తలమీద విరుచుకుపడ్డారు.

టీపీపీ కార్యకర్తలు ఉద్దేశ పూర్వకంగానే ముఖ్యమంత్రి జగన్ ఫ్లెక్సీలు చించేస్తూ అరుపులతో ప్రాంతాన్ని భయానకంగా మార్చేశారు. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామంతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. వైసీపీ కార్యకర్తలు సైతం భయంతో పరుగులు తీశారు. ఈ దాదాగిరీని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ముగ్గురు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కేవలం హింసతోనే హీరో అవ్వాలని లోకేష్ భావిస్తున్నట్లు ఆ సయమంలో ఆయన వాడిన భాషను వింటే అర్థం అవుతోంది. ఒక్కోక్కడిని ఉచ్చ పోయిస్తాను.. ఎర్ర బుక్కులో పేర్లు రాస్తున్నాను అంటూ బెదిరిస్తూ తమ కార్యకర్తలను రెచ్చగొట్టారు. ఎన్నికల్లో గెలిస్తే ఎవరిపై ఎన్ని కేసులు ఎక్కువగా ఉంటే అంత పెద్ద పదవి ఇస్తాను అంటూ లోకేష్ ఇచ్చిన బూస్ట్ ను చూసి టీడీపీ కార్యకర్తలు ఇలాంటి హింసాత్మక దాడులకు పాల్పడుతున్నారనే అభిప్రాయం ఉంది. ఇందుకు కారణం కూడా లేకపోలేదు.. ఏపీలో టీడీపీ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుంది. దీంతో ఎలాగైనా తన ఉనికిని రక్షించుకోవాలనే టీడీపీ అధినేత భావిస్తున్నట్లు తెలుస్తోంది.

టీడీపీ చేపడుతున్న ఇలాంటి చర్యలను చూస్తుంటే ఎంతమంది బలైన చివరకు అధికారం సాధించాలన్న గట్టిగా తలుచుకున్నట్లు కనిపిస్తోంది. ఎవరెన్నీ మాటలు అన్నా, దాడులకు దిగినా ఎవరి బెదిరింపులకు అదరక బెదరక ప్రజా సంక్షేమమే ఎజెండాగా దూసుకుపోతున్నారు వైఎస జగన్. ఇప్పటికే ప్రతి వర్గం అవసరాలు తెలుసుకుని వారు అడిగినా అడగకపోయినా వారి బాగోగులు చూసుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నూరుశాతం అమలు చేస్తూ ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్నారు. దీంతో మరో సారి జగన్ అందలం ఎక్కడం ఖాయమని తెలుస్తోంది. ఎన్ని కుట్రలు పన్నినా మరోసారి చంద్రబాబును నమ్మే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరనడంలో ఎలాంటి సందేహం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version