దాయాధి దేశాలు అయిన ఇండియా మరియు పాకిస్తాన్ లు మధ్యన క్రికెట్ మ్యాచ్ అంటే ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది ప్రేక్షకులు ఆసక్తికరంగా చూడడానికి ఎదురుచూస్తూ ఉంటారు. ఫార్మాట్ ఏదైనా, ఎక్కడైనా ఈ రెండు జట్ల మధ్యన మ్యాచ్ అంటే హోరాహోరీ గా ఉంటాయి. ఇక రీసెంట్ గా ఆసియా కప్ లో జరిగిన మ్యాచ్ కు కూడా అదే రకమైన ఆసక్తిని కనబరిచారు. అక్టోబర్ నెలలో వన్ డే వరల్డ్ కప్ ఇండియాలో జరుగనున్న విషయం తెలిసిందే. ఇక ఇండియా మరియు పాకిస్తాన్ లో ఒకే గ్రూప్ లో ఉండగా, అక్టోబర్ 14వ తేదీన ఆడనున్నాయి. ఈ మ్యాచ్ ను చూడడానికి అభిమానులు చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇక అడ్వాన్స్ బుకింగ్ లలో జోరు చూపిస్తోంది. ఇప్పటికే టికెట్లు అన్నీ కూడా హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.
ఇక ఈ టికెట్ లకు ఉన్న డిమాండ్ ను ఆధారంగా చేసుకుని కొన్ని ఆన్లైన్ టికెట్ ఎక్స్చేంజి, రీసేల్ వెబ్ సైట్ వయాగోగో ఒక టికెట్ ను ఏకంగా రూ. 57 లక్షలకు అమ్ముతుండడంతో ఫ్యాన్స్ అంతా కూడా ఫైర్ అవుతున్నారు.