కరోనా నేపథ్యంలో రాష్ట్రం మొత్తం లాక్ డౌన్ ప్రకటించిన క్రమంలో ఎక్కడికక్కడ ప్రజలు జాగ్రత్తలు తీసు కోవాలని ప్రభుత్వం స్వయంగా ప్రకటిస్తోంది. అదేసమయంలో నిత్యావసరాలను మాత్రం ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తోంది. ఉదయం ఆరు నుంచిమధ్యాహ్నం 1 గంట వరకు రిలాక్సేషన్ కూడా ఇచ్చింది. అయినప్పటికీ.. చిన్న చిన్న కారణాలు చూపుతూ.. కొన్ని చోట్ల ప్రజలు రోడ్డు మీదకు వస్తున్నా రు. ఇది అన్ని విధాలా ప్రాణాంతకమేనన్నది వైద్యులు చెబుతున్న కీలక సూచన. అయినా ఎవరూ పాటించడం లేదనేది పోలీసుల వాదన.
ఈ క్రమంలోనే ప్రజలను నిలువరించేందుకు విధిలేని పరిస్థితిలోనూ పోలీసులు తమ లాఠీలకు పని చె బుతున్నారు. ఇదిలావుంటే, నెల్లూరులో జరుగుతున్న పరిస్థితిని గమనించేందుకు, క్షేత్రస్థాయిలో పరిస్తి తిని తెలుసుకునేందుకు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, మంత్రి అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు రూరల్ ఎమ్మె ల్యే కో టంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలు ముందుకు వచ్చారు. నిజానికి ప్రజాప్రతినిధులు కూడా ఇళ్లకే పరిమిత మవు తున్నారు. తామే బయటకు వస్తే.. మిగిలిన వారిలో క్రమశిక్షణ తప్పుతుందని వారు ఆలోచిస్తున్నారు.
అయితే, నెల్లూరులో రెండు రోజులుగా పోలీసుల దూకుడు ఎక్కువగా ఉన్నదనే ఫిర్యాదులు వస్తున్నాయి. రోడ్లపై కనిపిస్తేనే కొడుతున్నారనే కథనాలు కూడా మీడియాలో చోటు చేసుకున్నాయి. దీంతో ఆయా పరి స్థితులను తెలుసుకునేందుకు మంత్రి అనిల్ ఎమ్మెల్యే కోటం రెడ్డిలు స్వయంగా పరిశీలించేందుకు గురువారం మధ్యాహ్నం పర్యటించారు. ఈ క్రమంలో అనవసరంగా రోడ్ల మీదికి వస్తున్నవారినిమంత్రి గుర్తించి హెచ్చరించారు.
ఇదే విషయాన్ని మీడియాతోనూ పంచుకున్నారు. చిన్న చిన్న కారణాలు, కుంటి సాకులు చెప్పిరోడ్ల మీదకు వస్తున్నవారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎమ్మెల్యే కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. వీరి పర్యటనపై విమర్శలు వస్తాయని కొందరు ఊహించినా.. జిల్లాలోనూ, రాజకీయ పక్షాల నుంచి కూడా వీరికి అభినందనలు వెల్లువెత్తాయి.